రైతు లేనిదే రాజ్యం లేదు

రైతే ఈ రాజ్యానికి వెన్నెముక , రైతుని గౌరవిద్దాం రైతన్నని కాపాడుకుందాం.

More

ఇది రైతు బిడ్డలు రైతుల కోసం చేసే ఓ చిన్న ప్రయత్నం

రైతు ఈ దేశానికి వెన్నెముక,ఇది రైతు రాజ్యం,రైతు రేపటి ఆశ , రైతే రాజు….అవి రాజీకియ నాయకులు ఓట్లు కొసం వచ్చినపుడు తప్ప మిగాతా రోజులు ఎవరికి గుర్తురాని పేదలు…

కాని రైతు మాత్రం ఎండా,వాన తేడా లేకుండా… ఆ మట్టి ని బంగారం చేస్తూనే వుంటాడు.పొలం దున్నే దగ్గర నుంచి విత్తనాలు వేసి పొలం పండేదాక …దాన్ని తన సొంత బిడ్డలు కన్న అపురూపంగా చూసుకుంటాడు. దాని కోసం వాల్లు ,వాళ్ల బిడ్డలు అన్నిరోజులు పస్తులు వున్న,వాటి కోసం ఎన్ని కష్టాలు పడిన ఒక్కసారి అ పంట చేతికి వస్తే అవి అన్నీ మర్చిపొయె వాడె అండి అ పిచ్చి రైతు…..ఆన్ని కష్టాలు పడి పంట చేతికి వస్తే దానికి తగిన గిట్టుబాటు ధర లేక, దలార్లు మోసం చేస్తుంటే,రాజకియ నాయకులు పట్టించుకోక.విషాన్ని కుడా అమృతంలా, వాళ్ల కుటుంబం మొత్తానికి పంచి తను తాగి అ మట్టి లోనె కలిసి పొతున్నాడు

రుణాలు ఇవ్వండి అమ్మ అని బ్యాంకులకెలితే నువ్వు రేపు రా ఎల్లుండిరా అని కనీస మర్యాద కూడ లేకుండా మాట్లాడతారు…అదే ఓ వ్యాపారం చేసుకుంటా నాకు ఓ 10 కోట్లు కావాలి అంటే…వాల్లకి మాత్రం ఎసి లు వేసి కొబ్బరి నీళ్ళు ఇచ్చి డబ్బులు చేతికి ఇస్తారు .వాడు డబ్బులు ఇవ్వకుండా పక్క దేశానికి వేళ్తాడు …కాని నువ్వు 10,000 ఇచ్చిన రైతు మాత్రం ఇవ్వలేక పొతే పురుగుల మందు ఐనా తాగుతాడు కాని పొలిమేర కుడా దాటడు.వంద సార్లు తిరిగి బ్యాంకు లొ రుణం తెచ్చుకుంటే…విత్తనాలు పురుగుల మందు వాళ్ళు మోసం చేస్తున్నారు…అది తట్టుకొని వేస్తె అ దేవుడికి కుడా రైతు అంటే చులకన….వర్షాలు అతివృష్టి అనావృష్టి చేసి వాడి పొట్ట కొడతాడు…. ఆయ్యొ దేవుడా అనీ అలా ఐనా అది కుడా తట్టుకొని పండిస్తే గౌర్నమెంట్ సరైన గిట్టుబాటు ధర ఇవ్వక….రైతు ని బలిపసువుని చేస్తునారు .

ఒకవేల పంట చేతికి వచ్చే సమయంలో ఎ అగ్గో రాసుకొని పంట కాలిపోతే….కనీస ధర కూడా ఇవ్వడు.

అదే ఎ కారో యాక్సిడెంట్ అయితే ఇన్సురేన్సు లు అని అది అని ఇది అని దాని ధర దానికి ఇస్తారు ….

అడికార్ కున్న విలువ అన్నం పండించే రైతుకి లేదు…

రైతులకి వాళ్ళ పిల్లలకి సరైనా అవగహన లేక దలార్ల చేతిలొ చిక్కి నాశనం…రైతు నిజంగా రైతు అవ్వాలంటె అ రైతు కడుపు మంట చల్లారాలి అంటే …

దలార్లకి దీటుగా ఎక్కడ ఎక్కడ ఏ పంట కి ఎంత ధర పలుకుతుం దో …రైతు బిడ్డలకి ఎ ఉ ద్యోగాలు వున్నాయా, ఏ పంట కి ఏ మందు ఏ మొతాదులో కొట్టాలో అన్నీ వివరిస్తు మీ ముందుకు వచ్చింది RaitheRaju.com

మీరు రైతు బిడ్డే అయితే ఈ విషయాన్ని అందరికి చేరేలా షేర్ చెయండి మరియు  SUBSCRIBE చేసుకోండి

Share This Page!

Follow Us